మలయాళంలో రూపొందిన ‘రతి నిర్వేదం’ సినిమా త్వరలో తెలుగులో అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘తనకు తెలియకుండానే తనకన్నా పెద్దదయిన అమ్మాయి ఆకర్షణకులోనైన అబ్బాయి, తనకన్నా చిన్నవాడి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక సతమతమయ్యే అమ్మాయి...ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. అబ్బాయి పాత్రలో శ్రీజిత్ నటించగా, అమ్మాయి పాత్రను శ్వేతామీనన్ పోషించారు. ఈ చిత్రానికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే మళయాలంలో విడుదలై మంచి విజయం సాధించింది.
యస్.వి.ఆర్.మీడియా సంస్థ ‘రతినిర్వేదం’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా విషయమై నిర్మాత శోభారాణి మాట్లాడుతూ...‘ప్రముఖ రచయిత కీ॥ పి.పద్మరాజన్ రచన ఆధారంగా తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం ‘రతినిర్వేదం’. 1978లో జయభారతి నటించగా ‘రతినిర్వేదం’ పేరుతో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా అనువాద హక్కుల కోసం ఎంతో పోటీ వున్నా తమిళ, తెలుగు అనువాద హక్కుల్ని మా సంస్థ సొంతం చేసుకుంది’ అన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్య్రకమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
For Rathi Nirvedam Movie Stills
0 comments:
Post a Comment