Entertainment

Home » » మరోసారి 'రౌడీ'గా మోహన్ బాబు

మరోసారి 'రౌడీ'గా మోహన్ బాబు

అవును అన్నగారు కాస్త.. రౌడీ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ ని అనుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఆ తర్వాత 'అన్నగారు' అని పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చివరకు ఆ సినిమాకు రౌడీ అని టైటిల్ ను ఖరారు చేశారు.
ఇప్పటికే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ దానికి తోడు చిత్ర టైటిల్ రౌడి కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా పరిటాల రవి లైఫ్ స్టొరీ నేపధ్యంలో రూపొందుతుందని ఆ మధ్య టాక్ నడిచినా అది ఎవరూ ఖండించలేదు.. అంగీకరించలేదు. పైగా ఈ సినిమాకి నిర్మాత ఎవరు? ఎప్పుడు మొదలు పెట్టారనేది కూడా తెలియదు.
ఈమధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాట రూపొందించినట్లుగా కథనాలు వచ్చిన అవి కూడా అధికారికంగా ఎవరూ పంపించిన వివారాలు కావు. అసలు ఈ సినిమా విషయంలో వర్మ.. ఇటు మోహన్ బాబు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. సినిమా పూర్తయ్యే వరకు కూడా ఈ సినిమాకు సంబంధించిన వివారాలను ప్రకటిస్తారో లేదో మరి!
Share this article :

Blog Archive

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. star cinema - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger