సౌత్ ఇండియలో ఏ హిరోకు లేనంత పాపులారిటి రజనీకాంత్ కు ఉందనడంలో ఏలాంటి సందేహం లేదు. అద్భుతమైన నటన, సూపర్భ్ యాక్షన్, మెస్మరైజింగ్ స్టైల్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రజనీ. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. 60 ఏళ్ల వయస్సులోనూ సౌత్ ఇండియన్ సినిమాల్లో రారాజుగా వెలుగొందుతున్నాడు రజనీకాంత్.
గతేడాది రోబోతో రికార్డులు తిరగరాసిన రజనీ ఈ ఏడాది ఎంతో ప్రెస్టిజియస్ గా రాణా సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన రోజే రజనీ అనారోగ్యం పాలవ్వడం.. ఆ తర్వాత కండిషన్ సీరియస్ గా మారడంతో సింగపూర్ లో దాదాపు ఏడువారాల పాటు ట్రిట్ మెంట్ తీసుకున్నాడు రజనీ. ఈ మధ్యే చెన్నై తిరిగివచ్చిన రజనీకాంత్.. పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. హెల్త్ కండీషన్ ఓకే అవ్వడంతో రాణా మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు రజనీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మూడు నుంచి రాణా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్ టాక్. వీలైనంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేయ్యాలని రజనీ, చిత్ర దర్శకుడు కె.యస్.రవికుమార్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. డిఫరెంట్ స్టోరీ లైనప్ తో రూపొందుతున్న ఈసినిమాకోసం రజనీ 20 కిలోల బరువుతగ్గిన విషయం తెలిసిందే. రజనీ సరసన బాలీవుడ్ క్యూట్ గాళ్ దీపికాపదుకొనే నటిస్తున్న ఈ సినిమాను సౌందర్య రజనీకాంత్, ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మొత్తానికి అభిమానులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న రజనీ డ్రీమ్ ప్రాజెక్ట్ రాణా త్వరలోనే సెట్స్ పైకి రానుందన్నమాట....రోబో తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ రాణాతో ఏలాంటి సంచలనాలు సృష్టిస్తాడో మరి.
0 comments:
Post a Comment