హాలీవుడ్‌లో అమితాబ్
అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. నాలుగు దశాబ్ధాల సినీ జీవితంలో బిగ్ బి చేయని రోల్ లేదు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా నవరసాలు పలికించగల గ్రేట్ యాక్టర్ అమితాబ్. అందుకనే ఆయన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రారాజుగా వెలుగొందుతున్నాడు.
అమితాబ్ సినిమాలకు కేవలం ఇండియాలోనే కాదు ప్రంపచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. వాల్డ్ వైడ్ గా బిగ్ బికి అభిమానులున్నారు. ఐతే అమితాబ్ ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గా పాపులారిటి ఉన్న బిగ్ బి ఇంతవరు ఒక్క హాలీవుడ్ సినిమాలో కూడ నటించలేదు. ఐతే త్వరలోనే బిగ్ బి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ బజ్ లుహర్ మాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ది గ్రేట్ గ్యాట్స్ బై అనే మూవీలో బిగ్ బి యాక్ట్ చేయనున్నారు. హలీవుడ్ లో మోలిన్ రోగ్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన బజ్ లుహర్ మాన్ ఈ సినిమాను ప్రెస్టిజియస్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ వేస్తున్నారు. స్కాట్ ఫిట్జర్లాండ్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ మూవీలో బిగ్ బి మేయర్ ఉల్ఫ్ షిం రోల్ లో కనిపించనున్నాడు.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్నఈ మూవీలో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో మెయిన్ రోల్ లో నటిస్తుండగా...స్పైడర్ మ్యాన్ హీరో టోబె మాగిర్ మరో పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. 125 మిలియన్ డాలర్లతో త్రీడీలో రూపొందిస్తున్న ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక హలీవుడ్ సెక్సీ బ్యూటీస్ ఇస్లా ఫిషర్,కారీ ముల్లిగాన్ తోపాటు జీయోల్ ఎడ్గీర్ టన్ లాంటి క్రేజీ స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వచ్చేవారం సిడ్నీలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అమితాబ్ హాలీవుడ్ ఎంట్రీతో ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి..

0 comments:
Post a Comment