బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ తన హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కండలు తిరిగిన బాడీ, ఫిజిక్, మంచి యాక్టింగ్ అతని ప్లస్ పాయింట్. దీంతో వరుస అవకాశాలు సూద్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. సోనూ త్వరలో మరో ప్రకాష్ రాజ్ కావడం ఖాయం అంటూ ప్రశంసించారు సినీ విశ్లేషకులు.
అయితే ఇతన్ని ఇటీవల అనుకోని బంపర్ ఆఫర్ వరించింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ సోనూసూద్ హీరోగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. బెల్లకొండ ప్రకటన వెలువడినప్పటి నుంచి కొమ్ములు మొలిచినట్లు ప్రవర్తిస్తున్నాడట సోనూసూద్. ఇంకా హీరో కాకముందే హీరోను మించిన టెంపర్ ప్రదర్శిస్తున్నాడట. కొందరు నిర్మాతలు అతన్ని విలన్ పాత్రలు చేయడం కోసం సంప్రదిస్తే.....ఇప్పడు నాది హీరో రేంజ్ ఇకపై విలన్ పాత్రలు చేయనంటూ తెగేసి చెబుతున్నాడట. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటేనే సినిమా రంగంలో లైఫ్ ఉంటుంది. ఈ సత్యం గ్రహించకుంటే సోనూసూద్ కెరీర్ కు ముప్ప తప్పదంటున్నారు విమర్శకులు.

0 comments:
Post a Comment