Entertainment

Home » » RAJANIKANTH INTERVIEW

RAJANIKANTH INTERVIEW

రజనీకాంత్‌ ఇంటర్వ్యూ


దక్షిణ భారత చలన చిత్ర దర్శకుల సంఘం 40వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా ఓ దర్శకుడు తనకు నచ్చిన నటుడ్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆందులో రజనీకాంత్‌ను ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ ఇంటర్వ్యూ చేశారు. రజనీకాంత్‌ తన స్కూల్‌ విద్యార్థి అని, ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా తనకు విద్యార్థే నంటూ బాలచందర్‌ ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ గురువుగా సంబోధించే రజనీని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉందన్నారు. బాలచందర్‌ అడిగిన ప్రశ్నలు, వాటికి రజనీ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానాలిలా ఉన్నాయి.



బాలచందర్‌ : స్టార్‌ అయ్యాక కోల్పోయిందేమిటి ?
రజనీకాంత్‌ : ఎన్నో కోల్పోయాను. సాధారణ వ్యక్తిలా హోటల్‌కు వెళ్లి భోజనం చేయలేకపోతున్నా. ప్రశాంతత కోల్పోయాను. అయితే ఇలాంటి వాటిని త్యాగం చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా.
బాలచందర్‌ : జీవిత చరిత్రను రాస్తారా ?

రజనీకాంత్‌ : జీవిత చరిత్రలో నిజాల్ని రాయాల్సి ఉంటుంది. అందులో పేర్కొనే అంశాలు ఇతరుల మనసును గాయపరచొచ్చు. జీవిత చరిత్ర రాసే ధైర్యం జాతిపిత మహాత్మా గాంధీకి మాత్రమే ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తా.

బాలచందర్‌ : దర్శకుడి అవతారం ఎత్తుతారా ?
రజనీకాంత్‌ : దర్శకత్వం గురించి నాకు తెలియదు. మక్కువా లేదు. దాని జోలికెళ్లను.

బాలచందర్‌ : ఇప్పటివరకు నటించిన చిత్రాలెన్ని ? అందులో నచ్చినవి ?
రజనీకాంత్‌ : 154 చిత్రాల్లో నటించాను. రాఘవేంద్ర, భాషా, ఎంతిరన్‌(రోబో) నచ్చిన చిత్రాలు

బాలచందర్‌ : జాతీయ అవార్డు ఎప్పుడు తీసుకుంటారు ?
రజనీకాంత్‌ : అది దర్శకుడి చేతిలో ఉంది.

బాలచందర్‌ : నచ్చిన దర్శకుడు ?
రజనీకాంత్‌ : మహేంద్రన్‌

బాలచందర్‌ : నాటాకాల్లో నటిస్తారా ?
రజనీకాంత్‌ : తప్పకుండా.

బాలచందర్‌ : సినిమాల్లో సిగరెట్‌ స్టైల్‌ తగ్గించారేంటి ?
రజనీకాంత్‌ : నిజ జీవితంలో సిగరేట్‌ తాగడమే తగ్గించేశాను.

బాలచందర్‌ : రాజకీయాల్లో ఇష్టమైన నాయకుడు ?
రజనీకాంత్‌ : ఆధునిక సింగపూర్‌ రూపకర్త లీక్వాన్‌ యూ.

బాలచందర్‌ : రాజకీయాల్లోకి వస్తారా ?
రజనీకాంత్‌ : అది దేవుడి చేతిలో ఉంది.

బాలచందర్‌ : ఎవరినైనా చూసి అసూయ పడ్డారా ?
రజనీకాంత్‌ : హిమాలయాల్లోని సాధువులను చూసి చాలా సార్లు అసూయ పడ్డా.

బాలచందర్‌ : నచ్చిన ఆహారం, స్నేహితుడు ?
రజనీకాంత్‌ : నచ్చిన ఆహారం చికెన్‌, ప్రియమిత్రుడు రావ్‌బహుదూర్‌.





Share this article :

0 comments:

Blog Archive

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. star cinema - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger