రామ్ చరణ్ త్వరలో డొకొమో అంటూ పాడుతూ టీవీల్లో కనిపించనున్నాడు. టాటా డొకోమోకి చెందిన ప్రమోషన్ వర్క్ ని ఈ రోజు నుంచే ప్రారంబించనన్నాడు. ఇందునిమిత్తం ఓ వారం క్రితం ఫోటో షూట్ కూడా జరిగింది. ఇప్పటికే రామ్ చరణ్ ..పెప్సీ,ఎయిర్ టెల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి ఉన్నాడు. అలాగే ఈ యాడ్స్ కి రామ్ చరణ్ మంచి మొత్తాన్నే డిమాండ్ చేసాడని తెలుస్తోంది. మరో ప్రక్క పోలో టీమ్ తోనూ, తన కాబోయో భార్య ఉపాసన తోనూ రామ్ చరణ్ బిజీగా వార్తల్లో ఉన్నాడు. సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment