దర్శకుడు తేజ గురించి
అందరికీ తెలిసిందే. జయం లాంటి యూత్ సినిమాలను తెరకెక్కించిన తేజ మహేష్
లాంటి స్టార్స్ తో కూడా నిజం సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎప్పుడో జయం
సినిమా తర్వాత మంచి సక్సెస్ మాత్రం లేదు. అయితే ఈ మధ్య నేను స్టార్స్ ను
హ్యాండిల్ చేయలేను.. స్టార్ హీరోలతో సినిమా అంటే స్క్రిప్ట్ లో కాంప్రమైజ్
కావాలని నాకది ఇష్టం లేదని మొహమాటం లేకుండా చెప్పేశాడు.
తాజాగా సాయిరామ్ శంకర్ లాంటి హీరోతో
వెయ్యి అబద్దాలు సినిమాలు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. అందుకే గత కొంత
కాలంగా తేజ తన సొంత నిర్మాణ సంస్థను కూడా అటకెక్కించాడు. అయితే ఇప్పుడు
మళ్లీ తిరిగి సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఓ సినిమాకి
శ్రీకారం చుట్టిన తేజ తప్పు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ప్రేమ విషయంలో ఈతరం చేస్తున్న తప్పు
ఏమిటి? వాళ్ల విషయాల్లో పెద్దవాళ్లు చేస్తున్న తప్పు ఏమిటి?? అనే
కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమా కోసం త్వరలోనే స్టార్ హంట్
కూడా నిర్వహించాలని చూస్తున్నాడట. మరి అందరూ కొత్త వాళ్ళతో బడ్జెట్
కంట్రోల్ లో చేయాలని చూస్తున్న ఈ సినిమా అయినా తేజకు సక్సెస్ ఇస్తుందో లేదో
చూడాలి!