Entertainment

Home » » ఊసరవిల్లి ఆడియో క్రేజ్

ఊసరవిల్లి ఆడియో క్రేజ్

ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లి మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోపై కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రం ఆడియో రైట్స్ ని నలభై ఐదు లక్షలకు ఇచ్చారని తెలుస్తోంది. మంచి పోటీలో ఈ రేటు పలికిందని చెప్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నారప. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.
Share this article :

0 comments:

Blog Archive

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. star cinema - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger