Entertainment

మరోసారి 'రౌడీ'గా మోహన్ బాబు

Wednesday, February 5, 2014

అవును అన్నగారు కాస్త.. రౌడీ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ ని అనుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఆ తర్వాత 'అన్నగారు' అని పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చివరకు ఆ సినిమాకు రౌడీ అని టైటిల్ ను ఖరారు చేశారు.
ఇప్పటికే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ దానికి తోడు చిత్ర టైటిల్ రౌడి కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా పరిటాల రవి లైఫ్ స్టొరీ నేపధ్యంలో రూపొందుతుందని ఆ మధ్య టాక్ నడిచినా అది ఎవరూ ఖండించలేదు.. అంగీకరించలేదు. పైగా ఈ సినిమాకి నిర్మాత ఎవరు? ఎప్పుడు మొదలు పెట్టారనేది కూడా తెలియదు.
ఈమధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాట రూపొందించినట్లుగా కథనాలు వచ్చిన అవి కూడా అధికారికంగా ఎవరూ పంపించిన వివారాలు కావు. అసలు ఈ సినిమా విషయంలో వర్మ.. ఇటు మోహన్ బాబు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. సినిమా పూర్తయ్యే వరకు కూడా ఈ సినిమాకు సంబంధించిన వివారాలను ప్రకటిస్తారో లేదో మరి!
Continue Reading | comments

తేజ... 'తప్పు' చేస్తున్నాడా..!

దర్శకుడు తేజ గురించి అందరికీ తెలిసిందే. జయం లాంటి యూత్ సినిమాలను తెరకెక్కించిన తేజ మహేష్ లాంటి స్టార్స్ తో కూడా నిజం సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎప్పుడో జయం సినిమా తర్వాత మంచి సక్సెస్ మాత్రం లేదు. అయితే ఈ మధ్య నేను స్టార్స్ ను హ్యాండిల్ చేయలేను.. స్టార్ హీరోలతో సినిమా అంటే స్క్రిప్ట్ లో కాంప్రమైజ్ కావాలని నాకది ఇష్టం లేదని మొహమాటం లేకుండా చెప్పేశాడు.
తాజాగా సాయిరామ్ శంకర్ లాంటి హీరోతో వెయ్యి అబద్దాలు సినిమాలు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. అందుకే గత కొంత కాలంగా తేజ తన సొంత నిర్మాణ సంస్థను కూడా అటకెక్కించాడు. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఓ సినిమాకి శ్రీ‌కారం చుట్టిన తేజ త‌ప్పు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ప్రేమ విష‌యంలో ఈతరం చేస్తున్న త‌ప్పు ఏమిటి? వాళ్ల విష‌యాల్లో పెద్దవాళ్లు చేస్తున్న త‌ప్పు ఏమిటి?? అనే కాన్సెప్ట్ నేప‌థ్యంలో రూపొందించనున్న ఈ సినిమా కోసం త్వరలోనే స్టార్ హంట్ కూడా నిర్వహించాలని చూస్తున్నాడట. మరి అందరూ కొత్త వాళ్ళతో బడ్జెట్ కంట్రోల్ లో చేయాలని చూస్తున్న ఈ సినిమా అయినా తేజకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి!
Continue Reading | comments

రతి నిర్వేదం తెలుగులో..

Monday, September 19, 2011


మలయాళంలో రూపొందిన ‘రతి నిర్వేదం’ సినిమా త్వరలో తెలుగులో అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘తనకు తెలియకుండానే తనకన్నా పెద్దదయిన అమ్మాయి ఆకర్షణకులోనైన అబ్బాయి, తనకన్నా చిన్నవాడి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక సతమతమయ్యే అమ్మాయి...ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. అబ్బాయి పాత్రలో శ్రీజిత్ నటించగా, అమ్మాయి పాత్రను శ్వేతామీనన్ పోషించారు. ఈ చిత్రానికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే మళయాలంలో విడుదలై మంచి విజయం సాధించింది.

యస్.వి.ఆర్.మీడియా సంస్థ ‘రతినిర్వేదం’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా విషయమై నిర్మాత శోభారాణి మాట్లాడుతూ...‘ప్రముఖ రచయిత కీ॥ పి.పద్మరాజన్ రచన ఆధారంగా తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం ‘రతినిర్వేదం’. 1978లో జయభారతి నటించగా ‘రతినిర్వేదం’ పేరుతో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా అనువాద హక్కుల కోసం ఎంతో పోటీ వున్నా తమిళ, తెలుగు అనువాద హక్కుల్ని మా సంస్థ సొంతం చేసుకుంది’ అన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్య్రకమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

For Rathi Nirvedam Movie Stills
Continue Reading | comments

Actresses Pregnancy Before Marriage

Friday, September 9, 2011

In the Past, we have seen actresses getting married suddenly and flaunting a baby bump in a month or two. The trend has been a part of Film Industry since quite a long time and while some actresses admit the fact, some fight it till the very end.
Here are a few actresses who were rumored to be pregnant before they got married.


When Sridevi announced her marriage to Boney Kapoor, she was, reportedly, seven months pregnant. Sridevi's relationship with Boney Kapoor was already under the scanner due to the fact that Boney was already married. Sridevi was, perhaps, the only actress who publicly accepted the fact that she was pregnant before her marriage.


Sarika was also involved with a married man - Kamal Hassan, and got pregnant with his child. Hassan was then married to Vani Ganapathy who took strong exception to their illicit affair. Irrespective of the state of their relationship, Sarika went ahead and gave birth to the lovechild, Shruthi Hassan. The two got married later on only to separate equally soon.


No one had a clue about when Mahima Chaudhary got married. People were still reeling from the sudden news of her wedding when she announced her pregnancy. Everything happened a little too soon for people to assume she had fallen pregnant after marriage.


Following Amrita Arora's hasty marriage announcement to beau Shakeel Ladak, tongues started wagging about what really prompted Amrita to take the wedding vows in such a hurry. Amrita's immediate pregnancy pretty much confirmed the reason of her sudden wedding.


Konkona Sen married co-actor Ranvir Shorey in a quiet wedding in September 2010. She gave birth to a baby boy in March 2011 leaving us with no doubt about the fact that she was very much pregnant when she exchanged vows with Shorey. Though the couple never admitted the fact, it was very much clear that the marriage happened because of Konkona's pregnancy.

Continue Reading | comments

RAJANIKANTH INTERVIEW

రజనీకాంత్‌ ఇంటర్వ్యూ


దక్షిణ భారత చలన చిత్ర దర్శకుల సంఘం 40వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా ఓ దర్శకుడు తనకు నచ్చిన నటుడ్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆందులో రజనీకాంత్‌ను ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ ఇంటర్వ్యూ చేశారు. రజనీకాంత్‌ తన స్కూల్‌ విద్యార్థి అని, ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా తనకు విద్యార్థే నంటూ బాలచందర్‌ ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ గురువుగా సంబోధించే రజనీని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉందన్నారు. బాలచందర్‌ అడిగిన ప్రశ్నలు, వాటికి రజనీ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానాలిలా ఉన్నాయి.



బాలచందర్‌ : స్టార్‌ అయ్యాక కోల్పోయిందేమిటి ?
రజనీకాంత్‌ : ఎన్నో కోల్పోయాను. సాధారణ వ్యక్తిలా హోటల్‌కు వెళ్లి భోజనం చేయలేకపోతున్నా. ప్రశాంతత కోల్పోయాను. అయితే ఇలాంటి వాటిని త్యాగం చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా.
బాలచందర్‌ : జీవిత చరిత్రను రాస్తారా ?

రజనీకాంత్‌ : జీవిత చరిత్రలో నిజాల్ని రాయాల్సి ఉంటుంది. అందులో పేర్కొనే అంశాలు ఇతరుల మనసును గాయపరచొచ్చు. జీవిత చరిత్ర రాసే ధైర్యం జాతిపిత మహాత్మా గాంధీకి మాత్రమే ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తా.

బాలచందర్‌ : దర్శకుడి అవతారం ఎత్తుతారా ?
రజనీకాంత్‌ : దర్శకత్వం గురించి నాకు తెలియదు. మక్కువా లేదు. దాని జోలికెళ్లను.

బాలచందర్‌ : ఇప్పటివరకు నటించిన చిత్రాలెన్ని ? అందులో నచ్చినవి ?
రజనీకాంత్‌ : 154 చిత్రాల్లో నటించాను. రాఘవేంద్ర, భాషా, ఎంతిరన్‌(రోబో) నచ్చిన చిత్రాలు

బాలచందర్‌ : జాతీయ అవార్డు ఎప్పుడు తీసుకుంటారు ?
రజనీకాంత్‌ : అది దర్శకుడి చేతిలో ఉంది.

బాలచందర్‌ : నచ్చిన దర్శకుడు ?
రజనీకాంత్‌ : మహేంద్రన్‌

బాలచందర్‌ : నాటాకాల్లో నటిస్తారా ?
రజనీకాంత్‌ : తప్పకుండా.

బాలచందర్‌ : సినిమాల్లో సిగరెట్‌ స్టైల్‌ తగ్గించారేంటి ?
రజనీకాంత్‌ : నిజ జీవితంలో సిగరేట్‌ తాగడమే తగ్గించేశాను.

బాలచందర్‌ : రాజకీయాల్లో ఇష్టమైన నాయకుడు ?
రజనీకాంత్‌ : ఆధునిక సింగపూర్‌ రూపకర్త లీక్వాన్‌ యూ.

బాలచందర్‌ : రాజకీయాల్లోకి వస్తారా ?
రజనీకాంత్‌ : అది దేవుడి చేతిలో ఉంది.

బాలచందర్‌ : ఎవరినైనా చూసి అసూయ పడ్డారా ?
రజనీకాంత్‌ : హిమాలయాల్లోని సాధువులను చూసి చాలా సార్లు అసూయ పడ్డా.

బాలచందర్‌ : నచ్చిన ఆహారం, స్నేహితుడు ?
రజనీకాంత్‌ : నచ్చిన ఆహారం చికెన్‌, ప్రియమిత్రుడు రావ్‌బహుదూర్‌.





Continue Reading | comments

నాగార్జున పాతికేళ్ల ప్రస్థానం

vikram


మాస్‌గా విలన్లను మడతెట్టాలన్నా...బాస్‌గా అందమైన సెక్రటరీలను పడగొట్టేయాలన్నా...రామదాసుగా భక్తిరసాన్ని పొంగించాలన్నా అది నాగార్జునకే సొంతం.క్లాస్‌-మాస్‌ అనే తేడాలేకుండా తెలుగు సినీ ప్రేక్షకులచే బ్రహ్మరథం పట్టించుకుంటున్న ఏకైక ఎవర్‌గ్రీన్‌ హీరో అక్కినేని నాగార్జున. నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి నేటికి 25 సంవత్సరాలు పూర్తయింది. 23-5-1986న నాగార్జున నటించిన తొలి చిత్రం ‘విక్రమ్‌’ విడుదలయింది. ఈ 25 సంవత్సరాలలో 76 చిత్రాలలో నటించిన నాగార్జున అరుదైన పాత్రలను అలవోకగా పోషించి...నవరసపాత్రల్ని అభినయించి అభిమానులందరికీ ఆరాధ్యుడయ్యారు. అభిరుచికలిగిన నిర్మాతగా 10 అపురూప చిత్రాలను కూడా నిర్మించారు. కళామతల్లి ముద్దుబిడ్డగా తన తోటి కళాకారులను గౌరవిస్తూ... వివాదాలకు అతీతంగా తన విజయపరంపర కొన సాగిస్తున్నారు.

ట్రెండ్‌ సెట్టర్‌: వారసత్వపు హీరోగానే అడుగుపెట్టినా తన సొంత ఇమేజ్‌తోనే నటుడిగా ఎదిగారు. తొలి చిత్రం ‘విక్రమ్‌’ కమర్షియల్‌గా హిట్‌ అయినా నటుడిగా రావలసినంత ఇమేజ్‌ మాత్రం రాలేదు. ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. మొట్టమొదటిసారిగా కాలేజీ నేపథ్యంలో రూపొందిన ‘శివ’ ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. రామ్‌గోపాల్‌వర్మకు తొలిసారిగా దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడమేగాక... తన సొంత బ్యానర్‌లోనే ఆ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలోనూ శతదినోత్సవాలను జరుపుకుని ఆరోజుల్లో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. తమిళంలో ‘ఉదయం’గా డబ్‌ చేసి మొత్తం 24 కేంద్రాలలో విడుదల చేయగా అక్కడ కూడా 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అంతేకాదు 5 కేంద్రాలలో 200 రోజులు ఆడింది. చెనై్న దేవి థియేటర్‌లో ‘ఉదయం’గా డబ్‌ చేసిన శివ చిత్రం 145 రోజులు వరుసగా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడం విశేషం. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్‌గాపాల్‌వర్మ బాలీవుడ్‌లోనూ తిరుగులేని దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు.

నవరసాభినయం: కేవలం 25 సంవత్సరాల నాగార్జున నటప్రస్థానంలో నవ రసాలు అద్భుతంగా పోషించగలిగే పాత్రలు లభించాయి. ఇది ఏ నటుడికీ దక్కని అరుదైన అవకాశం. ‘‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’, ‘మన్మధుడు’ చిత్రాలలో చక్కని శృంగార రసం పోషించి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇక ‘మాస్‌’, ‘రగడ’ లాంటి చిత్రాలలో వీరరసం పోషించారు. ‘గీతాంజలి’, ‘మజ్ఞు’ లాంటి చిత్రాలతో హృదయాలను కరిగించే కరుణరసాన్ని పండించారు. ‘హలోబ్రదర్‌’, ‘కింగ్‌’ లాంటి చిత్రాలతో హాస్యరసాన్ని అందించారు. ‘శివ’ ‘కిల్లర్‌’ లాంటి చిత్రాలతో రౌద్రరసాన్ని పండించారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి చిత్రాలతో భక్తిరసాన్ని పండించారు. ‘సంతోషం’ లాంటి చిత్రంతో శాంతరసాన్ని, ఇలా తను నటించిన ప్రతి పాత్రనూ ఎంతో అద్భుతంగా పోషిస్తూ అద్భుతరసాన్ని కూడా తన పాత్రలతో పలికిస్తున్నారు. నటుడిగా లెక్కలేనన్ని రివార్డులు, అవార్డులు అందుకున్నారు.
ragada
నిర్మాతగా విభిన్న చిత్రాలు : ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ఆస్వాదించే నాగార్జున విభిన్న కథాంశాలతో కూడిన వినూత్న చిత్రాలను నిర్మాతగా రూపొందించారు. తాను నటించకపోయినా మేనల్లుడు సుమంత్‌తో ‘సత్యం’ చిత్రాన్ని రూపొందించారు. అలాగే తన చిన్నకొడుకు అఖిల్‌ను హీరోగా చేసి అతనికి ఏడెనిమిది నెలల వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రాన్ని తీసి చక్కని విజయం సాధించారు. ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రం ద్వారా చక్కని కుటుంబ సందేశాన్ని అందిస్తూ మంచి వినోదాత్మక చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగానే కాకుండా నటుడిగానూ ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు ముందు వరసలో ఉంటారు అక్కినేని నాగార్జున. కేవలం మూస పాత్రలు, రొటీన్‌ ఫార్ములా పాత్రలలో నటించేందుకు నాగార్జున అంగీకరించరు. రీసెంట్‌గా విడుదలైన ‘గగనం’ చిత్రం ఇందుకు ఉదాహరణ. అప్పట్లో ‘అంతం’ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరో క్యారెక్టర్‌ చేసి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నారు. అందుకే ‘మాస్‌’ సినిమాలోనటించినా దానికి విభిన్నరీతిలో ‘శ్రీరామదాసు’ చిత్రంలో నటించి ఔరా ఆనిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మళ్లీ షిరిడీ సాయిబాబాగా కనువిందు చేయనున్నారు. అంతేకాదు ‘రాజన్న’ అనే ఓ చారిత్రాత్మక చిత్రంలో, ‘డమరుకం’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తూ వరసగా వైవిధ్యమైన పాత్రల్లో పరకాయప్రవేశం చేస్తున్న నాగార్జున బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు.

నాడు ‘విక్రమ్‌’ సినిమా చూసి నాగార్జున నటనకు పనికిరాడు అన్నవారే ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ పాత్రల్లో నాగార్జున నటనను చూసి నోరెళ్లబెట్టారు. తాము ఎంత తప్పుగా అంచనా వేశామో వారికి అప్పుడుగాని అర్థం అయివుంటుంది. ఇలా నాగార్జున నట ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.
Continue Reading | comments

త్వరలోనే రాణా షూటింగ్‌

Thursday, September 8, 2011


సౌత్ ఇండియలో ఏ హిరోకు లేనంత పాపులారిటి రజనీకాంత్ కు ఉందనడంలో ఏలాంటి సందేహం లేదు. అద్భుతమైన నటన, సూపర్భ్ యాక్షన్, మెస్మరైజింగ్ స్టైల్స్  తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రజనీ. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. 60 ఏళ్ల వయస్సులోనూ సౌత్ ఇండియన్ సినిమాల్లో రారాజుగా వెలుగొందుతున్నాడు రజనీకాంత్.

గతేడాది రోబోతో రికార్డులు తిరగరాసిన రజనీ ఈ ఏడాది ఎంతో ప్రెస్టిజియస్ గా రాణా సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన రోజే రజనీ అనారోగ్యం పాలవ్వడం.. ఆ తర్వాత కండిషన్ సీరియస్ గా మారడంతో సింగపూర్ లో దాదాపు ఏడువారాల పాటు ట్రిట్ మెంట్ తీసుకున్నాడు రజనీ. ఈ మధ్యే చెన్నై తిరిగివచ్చిన రజనీకాంత్.. పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. హెల్త్ కండీషన్ ఓకే అవ్వడంతో రాణా  మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు రజనీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మూడు నుంచి రాణా సెట్స్ పైకి  వెళ్లనున్నట్లు కోలీవుడ్ టాక్. వీలైనంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేయ్యాలని రజనీ, చిత్ర దర్శకుడు కె.యస్.రవికుమార్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. డిఫరెంట్ స్టోరీ లైనప్ తో రూపొందుతున్న ఈసినిమాకోసం రజనీ 20 కిలోల బరువుతగ్గిన విషయం తెలిసిందే. రజనీ సరసన బాలీవుడ్ క్యూట్ గాళ్ దీపికాపదుకొనే నటిస్తున్న ఈ సినిమాను సౌందర్య రజనీకాంత్, ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మొత్తానికి అభిమానులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న రజనీ డ్రీమ్ ప్రాజెక్ట్ రాణా త్వరలోనే సెట్స్ పైకి రానుందన్నమాట....రోబో తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ రాణాతో ఏలాంటి సంచలనాలు సృష్టిస్తాడో మరి.
Continue Reading | comments

Amitabh in Hollywood

హాలీవుడ్‌లో అమితాబ్‌

అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. నాలుగు దశాబ్ధాల సినీ జీవితంలో బిగ్ బి  చేయని రోల్ లేదు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా నవరసాలు పలికించగల గ్రేట్ యాక్టర్ అమితాబ్. అందుకనే ఆయన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రారాజుగా వెలుగొందుతున్నాడు.

అమితాబ్ సినిమాలకు కేవలం ఇండియాలోనే కాదు ప్రంపచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. వాల్డ్ వైడ్ గా బిగ్  బికి  అభిమానులున్నారు. ఐతే అమితాబ్ ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గా పాపులారిటి ఉన్న బిగ్ బి  ఇంతవరు ఒక్క హాలీవుడ్ సినిమాలో కూడ నటించలేదు. ఐతే త్వరలోనే బిగ్ బి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ బజ్ లుహర్ మాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ది గ్రేట్ గ్యాట్స్ బై  అనే మూవీలో బిగ్ బి  యాక్ట్ చేయనున్నారు. హలీవుడ్ లో మోలిన్ రోగ్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన బజ్ లుహర్ మాన్ ఈ సినిమాను ప్రెస్టిజియస్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ వేస్తున్నారు. స్కాట్ ఫిట్జర్లాండ్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ మూవీలో బిగ్ బి మేయర్ ఉల్ఫ్ షిం రోల్ లో కనిపించనున్నాడు.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్నఈ మూవీలో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో మెయిన్ రోల్ లో నటిస్తుండగా...స్పైడర్ మ్యాన్ హీరో  టోబె మాగిర్ మరో పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. 125 మిలియన్ డాలర్లతో త్రీడీలో రూపొందిస్తున్న ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక  హలీవుడ్ సెక్సీ బ్యూటీస్ ఇస్లా ఫిషర్,కారీ ముల్లిగాన్ తోపాటు జీయోల్ ఎడ్గీర్ టన్ లాంటి క్రేజీ స్టార్స్  ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వచ్చేవారం సిడ్నీలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అమితాబ్ హాలీవుడ్ ఎంట్రీతో ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి..
Continue Reading | comments

ఊసరవిల్లి ఆడియో క్రేజ్

ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లి మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోపై కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రం ఆడియో రైట్స్ ని నలభై ఐదు లక్షలకు ఇచ్చారని తెలుస్తోంది. మంచి పోటీలో ఈ రేటు పలికిందని చెప్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నారప. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.
Continue Reading | comments

డొకొమో బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

రామ్ చరణ్ త్వరలో డొకొమో అంటూ పాడుతూ టీవీల్లో కనిపించనున్నాడు. టాటా డొకోమోకి చెందిన ప్రమోషన్ వర్క్ ని ఈ రోజు నుంచే ప్రారంబించనన్నాడు. ఇందునిమిత్తం ఓ వారం క్రితం ఫోటో షూట్ కూడా జరిగింది. ఇప్పటికే రామ్ చరణ్ ..పెప్సీ,ఎయిర్ టెల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి ఉన్నాడు. అలాగే ఈ యాడ్స్ కి రామ్ చరణ్ మంచి మొత్తాన్నే డిమాండ్ చేసాడని తెలుస్తోంది. మరో ప్రక్క పోలో టీమ్ తోనూ, తన కాబోయో భార్య ఉపాసన తోనూ రామ్ చరణ్ బిజీగా వార్తల్లో ఉన్నాడు. సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.
Continue Reading | comments

Blog Archive

Gossips


Entertainment

Bollywood News

Topics:
Powered by Blogger.

Labels

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. star cinema - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger