దసరాకి కొత్త సినిమాల సందడి ఉంటుంది. దాంతో పోటీ కూడా భారీగా ఉంటుంది. ఈ దసరా బరిలో జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’, మహేష్ బాబు ‘దూకుడు’ నాగార్జున ‘రాజన్న’ తదితర భారీ చిత్రాలు తలపడనున్నాయి. ఎవరికి వారు తమ సినిమా హిట్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.
ఏ సినిమా పోటీ పడకుండా, క్లాష్ కాకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. బాలకృష్ణ ఏకంగా దసరా రేస్ నుండి తప్పుకొన్నారు. సో నందమూరి హీరోలలో మంచి అండర్ స్టాండింగ్ మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
జూ ఎన్టీఆర్ అయితే ఓవర్ టైమ్ కూడా చేసేస్తున్నాడని సమాచారం. ‘ఊసరవెల్లి’ హిట్ కొట్టి తీరాలనే కసితో ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా జూ ఎన్టీఆర్ పాలు పంచుకొంటున్నాడని సమాచారం. గెలుపు కోసం ఎన్టీఆర్ చేస్తున్న ఈ కృషి అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే...
0 comments:
Post a Comment